రెండు కొత్త ప్లాన్లు.. రోజుకు 3.5జీబీ, 4.5జీబీ డేటా!

Fri,August 10, 2018 05:11 PM

Vodafones 2 new plans offering 3.5GB and 4.5GB data per day

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్, భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీగా వొడాఫోన్ ఇండియా శుక్రవారం రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రూ.549, రూ.799లతో న్యూప్లాన్స్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లకు అపరిమిత సేవలను అందించడంలో భాగంగా భారీ డేటా ఆఫర్స్‌తో ముందుకొచ్చింది.

రూ.549 రీఛార్జ్ ప్లాన్ కింద రోజుకు 3.5జీబీ డేటాను అందిస్తోంది. దాంతో పాటు యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. రూ.799 రీఛార్జ్‌తో రోజుకు 4.5జీబీ డేటాను అందించనుంది. దాంతో పాటు వినియోగదారులు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవడంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులే. ఈ రెండు ప్లాన్‌లలో ఏదో ఒక దాన్ని రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు వొడాఫోన్ ప్లే యాప్‌లో ఉచితంగా లైవ్ టీవీ, సినిమాలు, వీడియోలను వీక్షించే సదుపాయం కూడా కల్పించింది.

2233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles