మీడియా, రాజకీయ నాయకులకు మనవి చేస్తున్నా..!

Wed,March 20, 2019 11:15 AM

Vivekas Daughter YS Sunitha Press Meet

పులివెందుల: నాన్న మరణం మమ్మల్ని ఎంతో కుంగదీసింది. నాన్నపై మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలు కన్నీరు తెప్పించాయి. మా నాన్నను అతికిరాతకంగా హత్య చేశారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని మా నాన్న కోరుకునే వారు వివేకా హత్యకు సంబంధించి నిష్ఫాక్షికమైన దర్యాప్తు జరగాలి. నాన్నకు ఎప్పుడూ ప్రజలే ముఖ్యం.. తర్వాత కుటుంబం. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. మాది చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా సభ్యులున్నారు. గత కొంతకాలంగా అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదు. చాలా కాలంగా పులివెందులలో నాన్న ఒక్కరే ఉంటున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలన్నది మా నాన్న కల. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు.


అధికార పెద్దలు కొందరు మా నాన్న హత్యపై ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారు. సిట్‌ విచారణ కాకముందే నిర్ణయాలు చెప్పేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్లే అలా చెబితే సిట్‌ విచారణపై ప్రభావం చూపదా? లెటర్‌ ఎవరు రాసిందన్నది ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుంది కదా..! నాన్న మృతి తెలిసి సన్నిహితులు చాలా మంది ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్లు తప్పు చేశారని ముందే ఎలా చెబుతారు? మీడియా, రాజకీయ నాయకులకు మనవి చేస్తున్నా.. సమన్వయం పాటించండి. మా కుటుంబం మధ్యే బేధాభిప్రాయాలు కల్పించే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు. పోలీసు విచారణ సక్రమంగా జరగనివ్వాలని కోరుతున్నా. ప్రత్యేక దర్యాప్తు బృందం తన పని తాను చేసుకునేలా వ్యవహరించండని సునీత కోరారు.

4466
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles