యూట్యూబ్‌లో వైరలవుతున్న స్టాండప్ కామెడీ వీడియోలు

Wed,December 6, 2017 06:36 PM

Viral Video of Stand up comedian Nishant comedy show Dilli Ki Shaadi

యూట్యూబ్.. అదో వీడియోల సముద్రం. ఓ మనిషి తన జీవితాంతం యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు చూసినా అయిపోనన్ని వీడియోలు అందులోకి అప్‌లోడ్ అయ్యాయి. రోజూ కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. అయితే.. ఈ మధ్య చాలా మంది కామెడీకి ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది కామెడీ షోలు, కామెడీ స్కిట్లు చేసిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఈ మధ్య స్టాండప్ కామెడీ షోలను కూడా నెటిజన్లు తెగ ఆదరిస్తున్నారు. ఆ కోవలోకి వచ్చేదే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో. స్టాండ్‌అప్ కమెడియన్ నిషాంత్ తన్వార్ యూట్యూబ్‌లో ఓ చానెల్ క్రియేట్ చేసి దాంట్లో స్టాండ్‌అప్ కామెడీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అయితే.. రీసెంట్‌గా 'ఢిల్లీ కీ షాదీ' అనే ఓ కామెడీ షోను ఆయన చేశారు. ఢిల్లీ పెళ్లిళ్లు ఎలా జరుగుతాయనే కాన్సెప్ట్‌తో ఆ కామెడీ షోను రూపొందించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. మీరు కూడా కాసేపు ప్రశాంతంగా ఆ వీడియో చూసి నవ్వుకోండి.

3199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS