వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారు.. వైరల్ వీడియో

Wed,June 19, 2019 03:53 PM

viral video of group of men fell from top of the bus

ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు.. అనే సామెతను మనం తరుచుగా వింటుంటాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. అవును.. వందల మంది యువకులు బస్సు పైకి ఎక్కి ఏదో ప్లకార్డ్ పట్టుకొని ఎటువంటి ఆధారం లేకుండా బస్సు మీద నిలబడ్డారు. బస్సు ఆగి ఉందేమో అని అనుకునేరు.. బస్సు రోడ్డు మీద పరుగులు పెడుతుండగానే.. అంతా బస్సు మీద నిలబడ్డారు. కొందరు ముందు కూర్చున్నారు కూడా.

అయితే.. ఇంతలో రోడ్డు మీద ముందు ఓ బైక్ రావడం.. సడెన్‌గా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయడంతో బస్సు మీద కూర్చున్నవాళ్లు, నిలబడ్డ వాళ్లు అందరూ రోడ్డు మీద పడిపోయారు. బస్సు కూడా వెంటనే ఆగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే ఏమన్నా ఉందా? బస్సు పైనుంచి రోడ్డు మీద పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకున్నది. బస్ డే సందర్భంగా విద్యార్థులంతా బస్సు ఎక్కి నినాదాలు చేస్తుండగా ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

ఎంత బ‌స్ డే అయితే మాత్రం.. అలా బ‌స్సు మీద నిల‌బ‌డి.. అటువంటి ఫీట్లు చేయ‌డం ప్ర‌మాదం అని తెలియ‌దా? తెలిసి కూడా ఇలా చేయ‌డం ఏంటో? అంటూ నెటిజ‌న్లు వాళ్ల‌పై ఫైర్ అవుతున్నారు.


4659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles