వైరల్ వీడియో: స్టాలిన్.. నెవర్ గివ్ అప్..!

Wed,October 18, 2017 07:27 PM

viral video of DMK Working president mk stalin exercise goes viral

చెన్నై: ఆటిట్యూడ్ అండ్ ఎఫర్ట్ ఢిపైన్స్ యూ... రైజ్ అప్ ఫర్ చాలెంజ్... గెట్ ఫిట్ ఫర్ లైఫ్.. డూ ఇట్ విత్ ఫాషన్.. లిఫ్ట్ అవే ద పెయిన్.. నెవర్ గివ్ అప్.. ఏంటీ.. ఏదైనా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? అదేం లేదు కాని... డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తెలుసు కదా.. ఆయనే.. ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. జిమ్‌లో ఎమ సీరియస్‌గా ఆయన కసరత్తులు చేస్తున్న వీడియో అది. అంతే కాదు.. ఆయన చేస్తున్న ఒక్కో కసరత్తును ఒక్కో స్ఫూర్తి కలిగించే వాక్యంతో సెట్ చేశారు. మీరు ముందుగా చదివిన వాక్యాలు అవే.

64 ఏండ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. రాజకీయాల్లో చురుకుగా ఆయన పాల్గొనడానికి కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో చేసే కసరత్తులే ఆయనను నవయవ్వనుడిలా ఉంచుతున్నాయి కాబోలు. స్టాలిన్.. నెవర్ గివ్ అప్.. కీప్ ఇట్ అప్.

2885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS