నాగలాండ్‌లో వాహనాలకు నిప్పు

Thu,February 2, 2017 09:26 PM

Violence In Nagaland Capital Kohima

కోహిమా : నాగలాండ్ రాజధాని కోహిమాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అక్కడి ట్రైబల్స్ డిమాండ్ చేస్తున్నారు. ట్రైబల్స్ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది ట్రైబల్స్ పాత సచివాలయం భవనం వద్దకు ర్యాలీగా వచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని ట్రైబల్స్ ఆ రాష్ట్ర సీఎం టీఆర్ జిలియాంగ్‌కు విజ్ఞప్తి చేశారు. ట్రైబల్స్ విజ్ఞాపనను సీఎం తిరస్కరించడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సచివాలయంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. నిన్న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles