బెస్ట్ ఆఫ్ ల‌క్.. విక్ర‌మ్‌

Fri,September 6, 2019 03:13 PM

హైద‌రాబాద్‌: భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌(ఇస్రో) శాస్త్ర‌వేత్త‌లు అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. మ‌రోసారి భార‌త ఖ్యాతిని ప్ర‌పంచ దేశాల‌కు చాట‌నున్నారు. ఇస్రో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌2 మ‌రికొన్ని గంట‌ల్లో చంద్రుడిపై వాల‌నున్న‌ది. చంద్రయాన్‌2లోని విక్ర‌మ్ ల్యాండ‌ర్‌.. నెల‌రాజుకు చెందిన ద‌క్షిణ ద్రువంపై దిగ‌నున్న‌ది. దీని కోసం ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. శాస్త్రవేత్త‌లు బెంగుళూర్ కేంద్రం నుంచి చంద్ర‌యాన్‌2 గ‌మనాన్ని ప‌రీక్షిస్తున్నారు. ద‌క్షిణ ద్రువంలోని మాంజీమ‌స్ సీ, సింపేలియ‌స్ ఎన్ మ‌ధ్య విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ 2వ తేదీన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌.. చంద్ర‌యాన్‌2 నుంచి విడిపోయింది. ఇవాళ రాత్రి ఒంటి గంట నుంచి చంద్ర‌యాన్‌2 లైవ్‌ను డీడీ లేదా ఇస్రో సైట్‌లో ప్ర‌త్య‌క్షంగా చూడ‌వ‌చ్చు.


ఇవాళ రాత్రి విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ డీసెంట్ మోడ్‌లోకి వెళ్తుంది. సుమారు రాత్రి ఒంటి గంట‌న్న‌ర స‌మ‌యంలో దాని వేగం త‌గ్గనున్న‌ది. దాంట్లో ఉన్న నాలుగు ఇంజిన్లు స్వీఛాప్ కానున్నాయి. సెంట్రల్ ఇంజిన్ మాత్రం ప‌నిచేస్తుంది. ఆ త‌ర్వాత స్పీడ్‌ను సెక‌న్‌కు 1.6 కిలోమీట‌ర్ల వేగానికి మారుస్తారు. ఇక్క‌డే ఆ 15 నిమిషాలు అత్యంత కీల‌క‌మైన‌వి. విక్ర‌మ్ స‌క్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై దిగాలంటే ఇదే ముఖ్య‌మైంది. విక్ర‌మ్ దిగే ప్రాంతం ప్ర‌త్యేక‌మైన‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మాంజీమ‌స్‌, సింపేలియ‌స్ మ‌ధ్య ఉన్న ప్రాంతం స‌మాంత‌రంగా ఉంటుంద‌ని, అది ద‌క్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. విక్ర‌మ్ దిగిన రెండు గంట‌ల త‌ర్వాత రోవ‌ర్ ప్ర‌జ్ఞ బ‌య‌ట‌కువ‌స్తుంది. రోవ‌ర్‌లో ఉన్న సోలార్ ప్యాన‌ల్ ఓపెన్ అవుతుంది. విక్ర‌మ్ దిగిన 3 గంట‌ల 15 నిమిషాల‌కు ఆరు గిర‌క‌లు ఉన్న రోవ‌ర్ ముందుకు క‌దులుతుంది. ఆ త‌ర్వాత 45 నిమిషాల‌కు చంద్రుడిని తాకుతుంది.

2747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles