చంద్రుడికి 2 కిలోమీట‌ర్ల దూరంలో.. విక్ర‌మ్‌కు ఏమైంది?

Sat,September 7, 2019 02:51 AM

హైద‌రాబాద్‌: చ‌ంద్ర‌యాన్‌2 అంతా సాఫీగా సాగింది. కానీ ఇంకా 2.1 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ప్పుడు విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌డం ఆగిపోయాయి. దీంతోనే ఇస్రోలో టెన్ష‌న్ నెల‌కొన్న‌ది. శాస్త్ర‌వేత్త‌లు ఇంకా డేటాను ప‌రిశీలిస్తున్నారు. కానీ సైంటిస్టుల‌ ముఖాల్లో చిరున‌వ్వులు క‌నిపించ‌లేదు. ప్ర‌ధాని మోదీతో పాటు ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌, మ‌రో ముగ్గురు మాజీ ఇస్రో చీఫ్‌లు కూడా ఆప‌రేష‌న్‌ను వీక్షించారు. కానీ వారు కూడా ఎక్క‌డా చిరున‌వ్వుల‌ను త‌మ ముఖంలో చూపించ‌లేదు. దీంతో విక్ర‌మ్‌కు ఏమైంద‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అత్యంత క్లిష్ట‌మైన 15 నిమిషాల ప్ర‌క్రియ‌ను ల్యాండ‌ర్ దాదాపు పూర్తి చేసుకునే స‌మ‌యంలో విఘాతం ఎదురైంది. చంద్రుడి ఉప‌రిత‌లానికి 2.1 కిలోమీట‌ర్ల ఆల్టిట్యూడ్ వ‌ర‌కు విక్ర‌మ్ స‌జావుగా ప‌నిచేసింద‌ని ఇస్రో చైర్మ‌న్ శివ‌న్ తెలిపారు. కానీ ఆ త‌ర్వాతే ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్ మిస్సైన‌ట్లు ఆయ‌న చెప్పారు. డేటాను ప‌రిశీలిస్తున్నామ‌ని శివ‌న్ చెప్పారు. అయితే డేటాను ప‌రిశీలించిన త‌ర్వాతే మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు ఇస్రో మీడియా సెంట‌ర్‌లో శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అధికారిక మీడియా స‌మావేశాన్ని కూడా ఇస్రో ర‌ద్దు చేసింది.

6205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles