మొండి బకాయిల రద్దు యోచనలో ఎస్‌బీఐ

Wed,November 16, 2016 02:22 PM

vijay malya old loan cancelled

బాడా బాబులపై ఎనలేని ఉదారత.. ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల బాకీల రద్దు.. కింగ్ ఫిషర్ మాల్యాతో పాటు వంద కంపెనీలకు ఊరట.. వీటికి మొండి బకాయిలని స్టేట్ బ్యాంక్ పేరు పెట్టింది.. జాబితాలో తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు కంపెనీలు..

ముంబై : వ్యాపారులకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారికి ఇచ్చిన రూ.7,016 కోట్ల బకాయిలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 63 మంది డిఫాల్లర్ల బకాయిలను రద్దు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన రూ.1,201 కోట్లు ఉన్నాయి. రుణాలు మాఫీ అయిన జాబితాలో ఏపీ, తెలంగాణకు చెందిన పలు కంపెనీలు ఉన్నాయి. విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్‌గేర్స్ రూ.65 కోట్లు, ఘన్‌శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జెవెల్స్ రూ.61 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.51 కోట్లు, టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.93.68 కోట్లు, తదితర కంపెనీల బకాయిల మాఫీ జరిగింది.

5718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles