8.75 కోట్లకు మాల్యా హెలికాప్టర్ల వేలం

Thu,September 20, 2018 09:26 AM

Vijay Mallyas 2 personal helicopters auctioned for over Rs8 Crore

బెంగుళూరు: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను వేలం వేశారు. ఆ హెలికాప్టర్లు రూ.8.75 కోట్లకు అమ్ముడుపోయాయి. వాటిని ఢిల్లీకి చెందిన చౌదరీ ఏవియేషన్ సంస్థ కొనుగోలు చేసింది. బెంగుళూరులోని డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఆ హెలికాప్టర్లను వేలం వేసింది. ఒక్కొక్క హెలికాప్టర్‌ను 4.37 కోట్లకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా కోనుగోలు చేశామని కంపెనీ వెల్లడించింది. బ్యాంకుల రుణాల ఎగవేసిన మాల్యా ఆస్తులను ఇటీవల ఆయా బ్యాంక్‌లు సీజ్ చేశాయి. అయితే బ్యాంకులకు చెందిన రికవరీ విభాగం మాల్యా హెలికాప్టర్లను ఈ-వేలంలో అమ్మేసింది. ఎయిర్‌బస్ యూరోకాప్టర్ బీ155 చాపర్లు రెండూ అయిదు సీట్ల సామర్థం కలిగి ఉన్నాయి. రెండూ డుయల్ ఇంజిన్ హెలికాప్టర్లే. ప్రస్తుతం ఈ రెండూ ముంబైలోని జూహా ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేశారు.

1937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles