రాజ‌కీయ జోక్యం ఎక్కువైతే నేనేమీ చేయ‌లేను : మాల్యా

Tue,June 26, 2018 03:20 PM

Vijay Mallya writes letter to PM Modi

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా గ‌తంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. బ్యాంకుల వద్ద ఉన్న బాకీలను తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో తెలిపారు. తనను డిఫాల్టర్‌గా చిత్రీకరించారని, దాంతో ప్రజల్లో తన పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. ఏప్రిల్ 15, 2016లో ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రికి లేఖలు రాశానని, ఆ లేఖలను బయటపెడుతున్నట్లు మాల్యా తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
తనపై వచ్చిన అభియోగాల పట్ల స్పందిస్తూ ఆ లేఖలు రిలీజ్ చేస్తున్న‌ట్లు ఆయన చెప్పారు. కానీ ఆ లేఖ‌ల ప‌ట్ల‌ తనకు సరైన సమాధానం రాలేదన్నారు. 2016లోనే మాల్యా విదేశాలకు పారిపోయాడు. ఆయన ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మాల్యాను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్‌పై వత్తిడి తెస్తోంది. అప్పగింత వారెంట్ కింద మాల్యాను గత ఏడాది యూకేలో అరెస్టు చేశారు. ఎస్బీఐ బ్యాంకుల వద్ద మాల్యా సుమారు 9వేల కోట్ల రుణం తీసుకున్నారు. ప్రజారంగ బ్యాంకుల అప్పులను చెల్లించేందుకు అన్ని ప్రయత్నాల చేశానని, కానీ రాజకీయంగా జోక్యం చేసుకుంటే తానేమీ చేయలేనని మాల్యా అన్నారు.


1750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles