మోస్ట్ వాంటెడ్‌ ఆర్థిక నేర‌గాడు.. విజ‌య్ మాల్యా

Sat,January 5, 2019 01:29 PM

Vijay Mallya will be the first tycoon to be named fugitive economic offender

న్యూఢిల్లీ: బిలియ‌నీర్‌ విజ‌య్ మాల్యా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌గాడు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం మాల్యాకు సంబంధించిన ఆస్తుల‌ను జ‌ప్తు చేసే అధికారం ఉంటుంది. మాల్యాపై ఇవాళ ముంబై కోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. అవినీతి నిరోధ‌క కోర్టు కొత్త చ‌ట్టం ప్ర‌కారం రుణాల ఎగ‌వేత కేసులో తీర్పునిచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ వేసిన ద‌ర‌ఖాస్తుపై కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఎస్బీఐ బ్యాంకుల‌కు సుమారు 9 వేల కోట్ల రుణాలు ఎగ‌వేసి పరారీలో ఉన్న మాల్యాను.. మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌గాడుగా ప్ర‌క‌టించాల‌ని కోర్టును ఈడీ కోరింది. భారీ ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డి విదేశాల‌కు వెళ్లే వారిని ప‌ట్టుకొచ్చేందుకు గ‌త ఏడాది ఆగ‌స్టులో ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. ఆర్థిక నేరాల‌ను అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతో ఆ చ‌ట్టాన్ని త‌యారు చేశారు. వంద కోట్ల క‌న్నా ఎక్కువ ఆర్థిక నేరానికి పాల్ప‌డి, ప‌రారీలో ఉన్న వ్య‌క్తిని మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేర‌గాడిగా ప్ర‌క‌టించాల‌ని ఫిజిటివ్ ఎక‌నామిక్ అఫెండ‌ర్స్ యాక్టు 2018 పేర్కొన్న‌ది.

1873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles