మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక మోదీ !

Fri,September 14, 2018 03:00 PM

Vijay Mallya left the country with the help of Modi, says Rahul Gandhi

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రధాని మోదీ సాయం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల గాంధీ అన్నారు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసిన మాల్యా.. తాను బ్రిటన్‌కు వెళ్లేముందే ఆర్థిక మంత్రి జైట్లీకి చెప్పినట్లు ఇటీవల వెల్లడించారు. ఈ అంశంపై ఇవాళ మళ్లీ రాహుల్ స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక సీబీఐతో పాటు ప్రధాని మోదీ కూడా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ సంకేతాల మేరకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందన్నారు. సీబీఐ నేరుగా ప్రధాని మోదీకి మాత్రమే రిపోర్ట్ చేస్తుందని, కానీ ఈ కేసులో సీబీఐ అలా ఎలా వ్యవహరించిందో అర్థం కావడం లేదని, మోదీ కనుసన్నల్లోనే సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందన్నారు. సీబీఐ తొలుత డిటెన్షన్ నోటీసును ఇచ్చిందని, కానీ మోదీ ఆదేశాలతో ఆ నోటీసు కాస్తా లుకౌట్‌గా మారిందని ఆరోపించారు. 2015 అక్టోబర్ 16వ తేదీన సీబీఐ మాల్యాకు నోటీసులు ఇచ్చింది. నవంబర్ 24న మరో నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9,10,11 తేదీల్లో మాల్యాను విచారించామని, కానీ ఆయన మళ్లీ రారన్న విషయాన్ని గ్రహించలేకపోయామని సీబీఐ వెల్లడించింది.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles