'కింగ్‌ఫిష‌ర్‌' ప‌క్షిలా ఎగిరిపోయిన మాల్యా..

Mon,September 19, 2016 04:33 PM

Vijay Mallya Flew Away Just Like Kingfisher Bird: Bombay HC

ముంబై : వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా కింగ్ ఫిష‌ర్ ప‌క్షి త‌ర‌హాలోనే పారిపోయాడ‌ని ఇవాళ ముంబై హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. కింగ్‌ఫిష‌ర్ అంటే ఓ ప‌క్షి అని, దానికి అవ‌ధులు ఉండ‌వ‌ని, అది ఎక్క‌డికంటే అక్క‌డికి ఎగిరిపోతుంద‌ని, బ్యాంకులకు టోపీ పెట్టిన విజ‌య్ మాల్యా కూడా ఆ ప‌క్షి త‌ర‌హాలోనే ప‌రార‌య్యాడ‌ని ముంబై హైకోర్టు పేర్కొంది. జ‌స్టిస్ ఎస్‌సీ ధ‌ర్మాధికారి, బీపీ కొల‌బావాలాకు చెందిన ధ‌ర్మాస‌నం ఈ అభిప్రాయాన్ని వినిపించింది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిష‌ర్ ఆస్తుల‌ను వేలం వేయాల‌ని స‌ర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఇత‌రులు వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు ఈర‌కంగా స్పందించింది. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ ప్ర‌యాణికుల టికెట్లకు సంబంధించి స‌ర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆ సంస్థ నుంచి రూ.32 కోట్లు రావాల్సి ఉంది.

2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles