మాల్యా పారిపోలేదట!

Thu,December 13, 2018 07:42 AM

vijay mallya did not escape says his lawyer

ముంబై: అందరూ భావిస్తున్నట్లుగా 2016, మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోలేదని, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే 300 బ్యాగులతో, భారీ కార్గోతో ఓ సమావేశానికి ఎవరైనా వెళ్తారా అని ఈడీ న్యాయవాది ప్రశ్నించారు. పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్, ఈడీ న్యాయవాది డీఎన్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్నది. పీఎంఎల్‌ఏ కోర్టు న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ముందు మంగళవారం అమిత్ దేశాయ్.. మాల్యా రహస్యంగా దేశం వీడిపోయారన్నదానిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ముందుగా ఖరారైన ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకే వెళ్లారని అన్నారు. దీనిపై బుధవారం ఈడీ తరఫు న్యాయవాది సింగ్ స్పందిస్తూ ఓ సమావేశానికి పెద్ద ఎత్తున సంచులు, సరుకుతో వెళ్తారా? అని నిలదీశారు. పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద మాల్యాను ప్రకటించాలంటూ కోర్టును ఈడీ కోరుతున్నది. ఈ క్రమంలోనే ఈ వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి.

1383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles