మాల్యా అరెస్టుకు ఆదేశాలు జారీ

Tue,June 14, 2016 06:16 PM

Vijay Mallya Declared Proclaimed Offender In Money Laundering Case

ముంబై: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిగా ప్రకటించింది. మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్లను రుణంగా తీసుకుని తిరిగి చెల్లించలేనని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం. బ్యాంకుల ఫిర్యాదులన్నింటిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మాల్యా అరెస్టుకు కోర్టును ఆశ్రయించింది. మాల్యాపై ఇప్పటికే నాన్ బెయిలబుల్‌తో పాటు పలు అరెస్ట్ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాదనల అనంతరం ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను నిందితుడిగా పేర్కొంటూ సెక్షన్ 82 కింద అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ స్పందిస్తూ ఇంటర్‌పోల్ సహకారంతో మాల్యా అదుపునకు రెడ్ కార్నర్ నోటీసులతో పాటు ఇంటర్నేషనల్ అరెస్టు వారెంట్‌ను జారీచేయనున్నట్లు తెలిపింది.

1636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles