మాల్యా కేసు.. ఇక నుంచి ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే..

Wed,October 24, 2018 02:48 PM

Vijay Mallya case to be personally supervised by CBI chief Nageshwar Rao

న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు చేస్తున్న అన్ని సున్నితమైన కేసులను ఇక నుంచి తాత్కాలిక డైరక్టర్ నాగేశ్వర్ రావు పర్యవేక్షించనున్నారు. ఎస్‌బీఐ బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసిన విజయ్ మాల్యా కేసుతో పాటు అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు కూడా ఇక నుంచి నాగేశ్వరరావు పర్యవేక్షించనున్నారు. డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానాలు సెలువుపై వెళ్లారు. దీంతో సీబీఐ చీఫ్ బాధ్యతలు నాగేశ్వరరావు తీసుకున్నారు. ఇక నుంచి ఆయన ఆధ్వర్యంలోనే సీబీఐ దర్యాప్తులు జరగనున్నాయి. మరోవైపు విచారణాధికారి ఏకే బాసిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ సీబీఐ తాత్కాలిక డైరక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాసిని పోర్ట్ బ్లెయిర్‌కు బదిలీ చేశారు. దానిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

1162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles