పాక్‌ ఆర్మీ అదుపులో భారత పైలట్‌..

Wed,February 27, 2019 04:23 PM

ఇస్లామాబాద్: భారత వాయుసేనకు చెందిన మిగ్‌-21 ఫైటర్‌జెట్‌ను తాము కూల్చివేసినట్లు ప్రకటించిన పాక్‌ ఆర్మీ, ఆ ఫైటర్‌ పైలట్‌ను కూడా తాము అదుపులోకి తీసుకున్నామని ఉదయం నుంచీ చెబుతోంది. ఇంతకుముందే ఆ పైలట్‌కు సంబంధించిన విడియో ఒకటి విడుదల చేసింది. అందులో తన పేరు అభినవ్‌ అని, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నానని చెబుతున్నట్లుగా ఉంది.


ఇదిలాఉండగా, మరో విడియోలో జెట్‌ కూలిపోయిన వెంటనే ప్యారాచూట్‌ సహాయంతో కిందికి దిగిన పైలట్‌ను స్థానికులు కొడుతున్నట్లుగా ఉంది. పాక్‌ ఆర్మీ వారిని వారించి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ విడియోలో స్పష్టంగా కనబడుతోంది.

సోషల్‌మీడియాలో ఈ విడియో విచ్చలవిడిగా షేర్‌ అవుతోంది. ఇది నిజమేనా..కాదా.. అనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. భారత్‌ కూడా మన మిగ్‌ ఒకటి కూలిపోయిందనీ, ఒక పైలట్‌ కనిపించట్లేదని మాత్రమే ప్రెస్‌మీట్‌లో తెలిపింది. కానీ, కనిపించకుండాపోయిన ఆ పైలట్‌ వివరాలు మాత్రం వెల్లడించలేదు.

పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. అభినందన్‌ తండ్రి రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్‌ స్కూల్‌లో అభినందన్‌ చదివారు. అభినందన్‌ కుటుంబం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌ అకాడమిలో నివసిస్తోంది.

23984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles