తప్పులో కాలేసిన వెంకయ్య నాయుడు!

Mon,November 26, 2018 05:42 PM

Vice President Venkiah Naidu tweeted an old photo of Preamble on Constitution Day

న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవం నాడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తప్పులో కాలేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఉప రాష్ట్రపతి అధికారిక ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఈ పొరపాటుకు కారణమైంది. శుభాకాంక్షలు చెబుతూ ఆయన రాజ్యాంగ పీఠికకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. అయితే అది సవరణకు ముందు ఉన్న పీఠిక. అందులో సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు లేవు. ఇది 1949లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పీఠికకు సంబంధించిన ఫొటో. అయితే ఈ ట్వీట్ చేసిన సుమారు 11 గంట‌ల త‌ర్వాత‌ ఈ పొర‌పాటును గ్ర‌హించి దానిని తొల‌గించారు. నిజానికి ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను కొత్తగా చేర్చారు. అత్యంత వివాదాస్పద రాజ్యంగ సవరణల్లో దీన్నీ ఒకటిగా పరిగణిస్తారు. ఈ సవరణ ద్వారానే దేశ పౌరుల ప్రాథమిక విధులను కూడా కొత్తగా చేర్చారు. పైగా ఈ సవరణ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కవ అధికారాలను ఇచ్చింది.


7138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles