మాజీ ప్రధాని మన్మోహన్ ను కలిసిన వెంకయ్య నాయుడుSat,August 12, 2017 06:21 PM
మాజీ ప్రధాని మన్మోహన్ ను కలిసిన వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : భారత ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను శనివారం కలిశారు. మన్మోహన్ ఇంటికి వెంకయ్య స్వయంగా వెళ్లి.. కాసేపు ఆయనతో ముచ్చటించారు. సభలో అన్ని పార్టీల నేతలు మాట్లాడేందుకు అవకాశం వచ్చేలా.. పారదర్శకంగా వ్యవహరించాలని వెంకయ్యకు మాజీ ప్రధాని చెప్పారు. మర్యాదపూర్వకంగానే మన్మోహన్ సింగ్ ను కలిసినట్లు వెంకయ్య తెలిపారు. వెంకయ్యకు మన్మోహన్ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు.

874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS