నేను ఉచిత పథకాలకు వ్యతిరేకం

Sun,May 19, 2019 11:55 AM

Vice President Venkaiah Naidu Speech in Guntur

గుంటూరు: దేశంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తలచుకుంటే గత రాజకీయాల పట్ల సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం గుంటూరు క్లబ్‌లో జరిగిన ఆత్మీయ సమావేవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని, రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఇంతగా దిగజారిపోయాయా అనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాలపై ప్రజలు, పత్రికలు సమీక్షలు చేయాలి. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కులం, మతం, ధనం ప్రధానం కాదు. పార్టీలు విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. నేను ఉచిత పథకాలను పూర్తిగా వ్యతిరేకం.

ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే తాను ఎన్నికల్లో పోటీ చేసేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 42ఏండ్ల తర్వాత తొలిసారిగా తాను లేకుండా ఎన్నికలు జరిగాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలకు దూరమైప్పటికీ.. గౌరవప్రదమైన పదవిలో ఉన్నట్లు చెప్పారు. భారత్‌లో తాను ఎక్కడా కూడా డాక్టరేట్‌ తీసుకోలేదని.. ఇక్కడ డాక్టరేట్‌లపై పెద్దగా గౌరవం లేదని అభిప్రాయపడ్డారు.

1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles