ఫ్రాన్స్ పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య

Fri,November 9, 2018 11:53 AM

Vice President M Venkaiah Naidu leaves France for 3 days tour

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫ్రాన్స్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్‌లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా వెంకయ్యతొలి రోజు పారిస్‌లో భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం పారిస్‌లో ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెమోరియల్‌ను ప్రారంభించనున్నారు. పారిస్ పీస్ ఫోరమ్ ప్రారంభంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ప్లీనరీ సెషన్‌లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. సోమవారం ఉదయం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS