జర్నలిస్ట్ హత్య కేసులో గుర్మిత్ సింగ్‌పై నేడు సీబీఐ తీర్పు

Fri,January 11, 2019 11:03 AM

Verdict in journalist murder case against Gurmeet Ram Rahim Singh likely today

ఛండీగఢ్: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పంచకుల, సిర్సా, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాల్లో రాష్ట్ర బలగాలు భారీగా మోహరించాయి. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు హర్యానా ఏడీజీపీ(లా అండ్ ఆర్డర్) మహ్మద్ అకిల్ తెలిపారు. తన ఇద్దరు మహిళా అనుచరులను అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్ రామ్ రహీం సింగ్ ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. 20 ఏండ్ల జైలు శిక్షను రోహతక్ సునరియా జైలులో గడుపుతున్నాడు. గుర్మిత్ సింగ్ మహిళలను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురిచేసేవాడో పూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి ప్రచురితం చేశాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి అక్టోబర్ 2002లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హత్యకు ప్రధాన కారకుడిగా గుర్మిత్ సింగ్ ఉన్నట్లుగా తేలింది. రాష్ట్ర విజ్ఞప్తి మేరకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించనుంది.

851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles