ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

Mon,July 17, 2017 07:35 PM

venkaiah naidu declared as nda vice presidential candidate


న్యూఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేరు ఖరారైంది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నామినేషన్ వేయనున్నారు.

వెంకయ్యనాయుడు 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయీ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1998, 2004, 2010లో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2014లో నరేంద్రమోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధిలో వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు.

దక్షిణాది నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడమే వెంకయ్య అభ్యర్థిత్వానికి కారణమైంది. వెంకయ్య తొలుత ఉపరాష్ట్రపతి పదవి పట్ల విముఖత చూపించినప్పటికీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. విపక్షాలు ఇప్పటికే గోపాలకృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో ఇప్పటికే ఇద్దరు తెలుగువారున్నారు. వెంకయ్యనాయుడు ఆ పదవి పొందితే ఉపరాష్ట్రపతి అయిన మూడో తెలుగువ్యక్తిగా నిలుస్తారు. ఉపరాష్ట్రపతి పదవిని తొలిసారిగా తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధిష్టించారు. ఆ తర్వాత వరాహగిరి వెంకటగిరి కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
venkaiah-vicepre3
venkaiah-vicepre4

3683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS