ముకుల్‌ రాయ్‌, భట్టాచార్య వాహనాలపై దాడి

Fri,May 17, 2019 11:28 AM

vehicles belonging mukul roy and Bhattacharya vandalised in west bengal

హైదరాబాద్‌ : పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి బీజేపీ నాయకులు ముకుల్‌ రాయ్‌, శామిక్‌ భట్టాచార్య వాహనాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ముకుల్‌ రాయ్‌, భట్టాచార్య తమ వాహనాల్లో లేరు. దీంతో వారిద్దరూ దాడుల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. భట్టాచార్య డమ్‌ డమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత వారం బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై కూడా దుండగులు దాడి చేశారు. టీఎంసీ, బీజేపీ మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఒక రోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాల్సి ఉండగా, గురువారం రాత్రి వరకే ప్రచారాన్ని పరిమితం చేసింది ఈసీ. ఏడో దశలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 9 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles