వాజ్‌పేయి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..

Thu,August 16, 2018 08:23 PM

Vajpayee said he did not get married because he got no time

హైదరాబాద్: భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి పెళ్లి చేసుకోలేదు. ఆయన బ్యాచిలర్‌గానే మిగిలిపోయారు. అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న అంశాన్ని ఆయన ఓ సారి చెప్పారు. తనకు పెళ్లి చేసుకునే సమయం దొరకలేదన్నారు. బాధ్య‌త లేని జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు చ‌మ‌త్క‌రించారు. 2002లో ఆయన ఓ సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కవితలతో జనాలను ఆకట్టుకుని రాజకీయాల్లో చేరినట్లు ఆయన చెప్పారు. అయిదవ తరగతి చదువుతున్నప్పుడు ఓ టీచర్ అటల్‌ను చెంపదెబ్బ కొట్టింది. అదే అతని జీవితంలో చాలా చేదు సంఘటనట. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ ఆహ్వానించడం.. వాజ్‌పేయి జీవితంలో థ్రిల్లింగ్ మూమెంట్. పార్లమెంట్‌లో బలపరీక్ష సమయంలో ఒక్క ఓటుతో ఓడినా.. ఆయన ఆ విషయం గురించి ఎన్నడూ బాధపడలేదట.

అటల్ బిహారి వాజ్‌పేయికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా. బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వానీ, మాజీ రాష్ట్రపతి భైరన్ సింగ్ షెకావత్, మాజీ ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్‌లు. వాజ్‌పేయికి ఎనలేని ప్రేరణగా నిలిచినవారిలో ఆయన తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన గురుగోల్వర్‌కర్‌జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బాహు రావు డియోరాలు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. వాజ్‌పేయికి ఫేవరేట్ లీడర్. శరత్ చంద్ర, ప్రేమ్ చంద్‌లు.. ఆయన ఫెవరేట్ రచయితలు. హరివంశ్ రాయ్ బచ్చన్, రామ్‌నాథ్ అవాస్తి, డాక్టర్ శివ్ మంగల్ సింగ్ సుమన్, సూర్య కాంత్ త్రిపాఠీ, బాల్ కృష్ణ శర్మ నవీన్, జగన్నాథ్ ప్రసాద్ మిలింద్, ఫయాజ్ అహ్మద్ ఫయాజ్‌ల నుంచి కూడా ఆయన ప్రేరణ పొందారు.

భీమ్ సేన్ జోషి, అంజద్ అలీ ఖాన్, హరి ప్రసాద్ చౌరాసియాలు.. వాజ్‌పేయికి నచ్చిన క్లాసికల్ ఆర్టిస్టులు. లతా మంగేస్కర్, ముఖేశ్, ఆర్డీ బర్మన్ గీతాలంటే ఆయనకు ఇష్టం. సచిన్ దేవ్ బర్మన్ బాణీలన్నా వాజ్‌పేయికు ఎనలేని ప్రీతి. సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, సుచిత్రా సేన్‌లు నచ్చిన నటులు. ఓ మేరి మాంజి.. సున్ మేరీ బంధు రే, కబీ కబీ మేరా దిల్ మే సాంగ్స్ అంటే వాజ్‌పేయికి ఇష్టం. దేవదాస్, బందిని, తీస్రీ కసమ్, మౌసమ్, మమతా, ఆంధీ చిత్రాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డారు. బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ కవాయి, బార్న్ ఫ్రీ, గాంధీ లాంటి ఇంగ్లీస్ చిత్రాలన్నా ఆయనకు ఇష్టమే.

వాజేపేయి ఓ మంచి కుక్. వంటలు వండడంలో ఆయన దిట్ట. కిచిడీ, పూరి కచోరీ, దహి పకోడి, పంథా, ఖీర్, మాల్‌పావ్, కచౌరీ, మంగోరీలు ఆయనకు నచ్చిన వంటలు. హాస్టల్‌లో ఉన్నప్పుడు.. అటల్ వాజ్‌పేయి తన తండ్రికి స్వయంగా వండి వడ్డించేవారట. సీనియర్ వాజ్‌పేయి బయటి ఫుడ్‌ను తీనేవారు కాదు.

10618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles