రేపు సాయంత్రం వాజ్‌పేయి అంత్యక్రియలు

Thu,August 16, 2018 06:57 PM

Vajpayee last rites to conduct tomorrow Evening at Rashtriya smriti sthal

న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్థీవదేహాన్ని ఎయిమ్స్ నుంచి నేరుగా ఆయన నివాసానికి తరలించారు. వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమసంస్కారాలు జరుగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి వాజ్‌పేయి పార్థీవ దేహాన్ని తరలిస్తారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

3418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles