హిందుత్వకు మరో పేరు వాజ్‌పేయి..

Thu,August 16, 2018 09:14 PM

Vajpayee is ardent Hindutva follower

హైదరాబాద్: వాజ్‌పేయి అంటే హిందుత్వ. ఇప్పుడున్న బీజేపీకి హిందుత్వమే ప్రాణం. ఆ సిద్ధాంతమే ఆ పార్టీని విజయపథంలో నడిపిస్తున్నది. ఆ భావనకు ఆజ్యం పోసింది వాజ్‌పేయి. కానీ హిందుత్వ పట్ల వాజ్‌పేయికి ఉన్న అభిప్రాయం భిన్నమైంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి.. పదవ తరగతిలో ఉన్నప్పుడు హిందుత్వంపై ఓ కవిత రాశారు. హిందూ తన్ మన్.. హిందూ జీవన్ రగ్ రగ్.. హిందూ మేరా పరిచయ్ అని ఓ కవితలో రాశారు. హిందుత్వ భావజాలానికి ప్రతీకగా నిలిచారు.

ఓ సారి పూణెలో ఆయన హిందుత్వ గురించి మాట్లాడారు. నేను హిందువును, దీన్ని నేనెలా మరిచిపోగలను అన్నారు. ఎవరూ ఆ విషయాన్ని మరవరాదు, నా హిందుత్వానికి హద్దులు లేవన్నారు. అంతర్ కుల, అంతర్ మత వివాహాలను తన హిందుత్వ అడ్డుకోరాదన్నారు. హిందుత్వ అంటే చాలా విశాలమైందని వాజ్‌పేయి అన్నారు.

హిందూ మతంపైన కూడా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ వ్యాసంలో రాశారు. హిందూ మతం తనకు ఎందుకు ఇష్టమంటే.. మానవత్వం కలిగి ఉన్న ఉత్తమ మతం ఇదే అని ఆయన అన్నారు. హిందుత్వ ఒక్క పుస్తకానికో, ఒక మతానికి సంబంధించిన అంశం కాదని, హిందూ మతమనేది.. హిందూ సమాజం నుంచి ఉద్భవించిందన్నారు. అందుకే హిందూ మతం పరిఢవిల్లుతున్నదని వాజ్‌పేయి అన్నారు. తన అనేక ప్రసంగాల్లో రామున్ని ప్రస్తావించేవారు. విపక్ష నేతలు కూడా వాజ్‌పేయి హిందుత్వ భావజాలాన్ని ఆమోదించేవారు.

2813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles