కొత్త రూల్స్‌ కొత్త ఆలోచన..హెల్మెట్‌కే డాక్యుమెంట్లు..వీడియో

Tue,September 10, 2019 05:35 PM

Vadodara R shah Pasted his driving license, RC, insurance on his helmet

వడోదరా: ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించిన వాహనదారులపై కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా జరిమానా విధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వాహనదారులకు కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఆర్‌ షా అనే వ్యక్తి తన డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఇతర డాక్యుమెంట్లను ఏకంగా తన హెల్మెట్‌కే ఫిక్స్‌ చేశాడు.


ఆర్‌ షా హెల్మెట్‌ ముందు భాగంలో ఇన్సూరెన్స్‌ కాగితాలు, పక్క భాగంలో ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అతికించాడు. నేను బైకు నడిపేముందు తీసుకునేది హెల్మెట్‌. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర ధ్రువ పత్రాలు మరిచ్చిపోకుండా హెల్మెట్‌కు వాటిని అతికించా. ఈ నిర్ణయంతో కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం నాకు ట్రాఫిక్‌ ఉల్లంఘనల సమస్య రాదు. బైకు నడిపేటపుడు హెల్మెట్‌ తప్పనిసరి తీసుకెళ్తాం కాబట్టి డాక్యుమెంట్లు మరిచిపోయే అవకాశమే ఉండదు. ఈ కొత్త ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఎంతమంది ఆర్‌ షాను ఫాలో అవుతారో చూడాలి.3276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles