రెండోసారి ఆడపిల్ల పుట్టిందని.. పైనుంచి తోసేశాడు..

Fri,September 14, 2018 02:42 PM

Uttar Pradesh Man Throws Toddler Daughter from Terrace

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని పార్దౌలి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 నెలల ఆడబిడ్డ ఉంది. ఐదు రోజుల క్రితం మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి అరవింద్ గంగ్వార్ పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడుతూ.. 18 నెలల బిడ్డను తను నివాసం ఉంటున్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసేశాడు. దీంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కుటుంబ సభ్యులు అరవింద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అరవింద్‌ను అరెస్టు చేశారు. రెండోసారి కూడా ఆడబిడ్డ పుట్టినందుకే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసుల ఎదుట అరవింద్ ఒప్పుకున్నాడు.

4757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles