ఆ పోలీసు 30 రోజులు సెలవడిగితే.. 45 రోజులు ఇచ్చారు..!

Sat,June 23, 2018 03:56 PM

Uttar Pradesh cop asks for 30 day leave to expand family

సాధారణంగా ఉద్యోగులు ఎప్పుడు సెలవులు తీసుకుంటారు. ఏదైనా పండుగకో, పబ్బానికో.. లేదంటే ఎవరిదైనా పెండ్లి, పేరంటం ఉంటే తీసుకుంటారు. టూర్‌కు గట్రా వెళ్లినా సెలవు తీసుకుంటారు. కాని.. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సోమ్‌సింగ్ మాత్రం విచిత్రమైన కారణం చెప్పి తన పైఅధికారులను 30 రోజుల సెలవు అడిగాడు. అయితే.. మనోడి కారణానికి ఫిదా అయిపోయిన అధికారులు ఏకంగా మనోడికి 45 రోజుల సెలవు ఇచ్చాడు. ఇంతకీ ఏం కారణం చెప్పి సెలవు తీసుకున్నాడనేగా మీ సందేహం.

"సార్.. నాకు 30 రోజుల లీవ్ కావాలి.. నా ఫ్యామిలీ విస్తరించుకోవాలి కదా. పట్టుమని ఒకరోజు కూడా ఇంటి దగ్గర ఉన్నది లేదు. నాకూ పిల్లలను కనాలని ఉంది. అందుకే నాయందు దయ తలిచి ఓ 30 రోజులు సెలవిచ్చారంటే మీకు కృతజ్ఞుడనై ఉంటా.." అంటూ పైఅధికారులకు అప్లయి చేసుకున్నాడట. అయితే.. మనోడి బాధను అర్థం చేసుకున్న ఇన్‌స్పెక్టర్ డబుల్ ధమాకా ఇచ్చాడు. 30 రోజులు కాకుండా 45 రోజులు సెలవు ఇచ్చి పండుగ చేసుకోమన్నాడు. దీంతో ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎంతో ఖుషీతో ఇంటిముఖం పట్టాడు.

అయితే.. ఇలా వింతవింత కారణాలతో లీవ్ అప్లికేషన్లు పెట్టుకోవడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు పాకిస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థికి సంబంధించిన సిక్ లీవ్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన లీవ్ అప్లికేషన్‌ను ఆ విద్యార్థి తన స్కూల్ హెడ్‌మాస్టర్ ముందు ఓ పాటలా పాడాడు. మరి.. ఆ ట్రిక్ మనోడికి వర్కవుట్ అయిందో లేదో కాని.. ఆ విద్యార్థి మాత్రం పాకిస్థాన్‌లో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు.

5522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS