మ‌సూద్ అజ‌ర్‌ను బ్యాన్ చేయండి.. వీటో దేశాల‌ డిమాండ్‌

Thu,February 28, 2019 09:09 AM

US, UK and France ask UN Security Council to ban JeM chief Masood Azhar

హైద‌రాబాద్: జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించి, అత‌న్ని బ్యాన్ చేయాల‌ని మ‌రోసారి అగ్ర‌దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ లాంటి దేశాలు.. ఐక్యరాజ్య‌స‌మితిలో ఈ తాజా ప్ర‌తిపాద‌న చేశాయి. ఈ అంశంలో మ‌రో అగ్ర రాజ్యం చైనాపైన కూడా ఆ దేశాలు వ‌త్తిడి తీసుకువ‌స్తున్నాయి. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌పై త‌మ నిర్ణ‌యం వెల్ల‌డించేందుకు యూఎన్ క‌మిటీ ముందు ప‌ది రోజుల గ‌డువు ఉంటుంది. మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టిస్తూ, అత‌నిపై ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని కోరాయి. అతని ఆస్తులు సీజ్ చేయాల‌ని డిమాండ్ చేశాయి. ఆయుధాల‌ను కూడా సీజ్ చేయాల‌న్నాయి. భ‌ద్ర‌తా మండ‌లిలో మొత్తం 15 స‌భ్య‌దేశాలు ఉన్నాయి. అయితే శాశ్వ‌త వీటో ప‌వ‌ర్ క‌లిగిన మూడు దేశాలు .. మ‌సూద్ అజ‌ర్‌ను బ్యాన్ చేయాల‌ని ప్ర‌తిపాదించాయి.

2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles