పెళ్లి వేడుక.. భోజనం సరిగ్గా లేదని గొడవ.. వీడియో

Tue,February 12, 2019 11:10 AM

Upset Over Food Guests At Delhi Wedding Beat Up Hotel Staff

న్యూఢిల్లీ : ఓ పెళ్లి వేడుకలో నాణ్యతతో కూడిన భోజనం వడ్డించలేదని హోటల్‌ సిబ్బందితో అతిథులు గొడవ పడ్డారు. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలోని ఓ హోటల్‌లో చోటు చేసుకుంది. పెళ్లి వేడుక ముగియగానే.. అతిథులందరూ భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే భోజనం నాణ్యతతో లేదని అతిథులు హోటల్‌ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన అతిథులు.. అక్కడున్న ప్లేట్లను పగులగొట్టారు. కిచెన్‌లోకి ప్రవేశించి అన్ని వంటలను కిందకు పడేశారు. ఆ తర్వాత హోటల్‌ సిబ్బందిని చితకబాదారు. ఈ తతంగాన్ని అంతా అక్కడున్న కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి వైరల్‌ చేశారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles