దీపావళి అమ్మకాలు నీరసిస్తే అంతే సంగతి

Wed,September 18, 2019 07:38 AM

న్యూఢిల్లీ: మాంద్యం.. మాంద్యం.. మాంద్యం. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా ఇదే. కీలక రంగాలను కుదేలు చేస్తున్న ఈ మందగమనానికి.. రాబోయే పండుగ సీజన్ పరిష్కారం చూపగలదన్న ఆశాభావంతో పరిశ్రమ కనిపిస్తున్నది. అందుకే ఈ పదేండ్లలో ఈసారి దీపావళి అత్యంత కీలకం. దీనికి వ్యాపార రంగంలో ఉన్న ప్రాముఖ్యత కూడా ఎక్కువే. అందుకే దాదాపు అన్ని వ్యాపారాలు దీపావళి రోజుల్లో కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ గూడ్స్, ఆటో, నిర్మాణ రంగాలన్నీ కూడా మొత్తం ఏడాది వ్యాపారాన్ని ఈ పండుగ అమ్మకాల సగటు ఆధారంగానే అంచనా వేస్తాయంటే దీపావళికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. కాగా, ఈసారి అమ్మకాల ఆధారంగా మాంద్యం నుంచి గట్టెక్కామా? లేదా? అన్నది తేలుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌ఎంసీజీలో 35-40 శాతం, కన్జ్యూమర్ గూడ్స్‌లో 8-9 శాతం విక్రయాలు నమోదైతే మాంద్యం నుంచి బయటపడిన సంకేతాలుంటాయని, ఇందు లో సగానికే పరిమితమైతే కొంత మెరుగయ్యామని, అంతకు తగ్గితే మాత్రం మాం ద్యం ప్రభావం చాలా ఉందనుకోవచ్చంటూ చెబుతున్నారు.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles