ఇక మంత్రులు.. ఎవ‌రి ఆదాయ‌ప‌న్ను వారు క‌ట్టాల్సిందే..

Sat,September 14, 2019 08:34 AM

UP Ministers to start paying tax, four decade old practice ends

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ రాష్ట్ర సీఎంతో పాటు మంత్రులు కూడా ఇక నుంచి ఎవ‌రి ఆదాయ‌ప‌న్నును వారే చెల్లించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల క్రితం నాటి ఓ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు తాజాగా యోగి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1981లో అప్ప‌టి సీఎం వీపీ సింగ్ ఓ చ‌ట్టాన్ని రూపొందించారు. పేద మంత్రులు త‌మ ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దీంతో ఆ నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కానీ, మంత్రులు కానీ.. త‌మ ఆదాయంపై ప‌న్ను చెల్లించ‌డంలేదు. ఆ ప‌న్ను మొత్తాన్ని రాష్ట్ర ఖ‌జానా నుంచి చెల్లిస్తున్నారు. ఇది ప్ర‌తి ఏడాది ఒకేసారి అందేలా చూస్తారు. అయితే ఇప్పుడు ఆ ట్రెజ‌రీ చ‌ట్టాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు యోగి గ‌వ‌ర్న‌మెంట్ వెల్ల‌డించింది. నిజానికి ఈ రూల్ ఉంద‌న్న విష‌యం కూడా చాలా మంది మంత్రుల‌కు తెలియ‌దు. ఈ రూల్ అమ‌లు చేస్తున్న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 19 మంది సీఎంలు, వెయ్యి మంది వ‌ర‌కు మంత్రులు ల‌బ్ధి పొందారు. యోగి, ములాయం, అఖిలేశ్‌, మాయావ‌తి, క‌ళ్యాణ్ సింగ్‌, రామ్ ప్ర‌కాశ్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్‌, శ్రీప‌తి మిశ్రా, వీర బ‌హ‌దూర్ సింగ్‌, ఎన్డీ తివారీ లాంటి సీఎంలు ట్రెజ‌రీ చ‌ట్టం నుంచి ల‌బ్ది పొంది త‌మ ఆదాయాన్ని ఆదా చేసుకున్నారు. గ‌త ఏడాది యూపీ మంత్రుల ఆదాయ బిల్లు 86 ల‌క్ష‌లు వ‌చ్చింది. దాన్ని రాష్ట్ర ఖ‌జానా నుంచే చెల్లించారు. దీంతో పేద మంత్రులు ఉన్న‌ప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన రూల్‌ను ఇప్పుడు ఎత్తివేస్తున్న‌ట్లు యోగి ప్ర‌భుత్వం చెప్పింది. అఖిలేశ్‌, మాయావ‌తి లాంటి నేతలు త‌మ ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో వందల కోట్లు ఉన్నట్లు కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆనాటి చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు యూపీ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖ‌న్నా వెల్ల‌డించారు.

874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles