సివిల్స్ వచ్చిందని సన్మానాలు.. కానీ తండ్రికి గుండెపోటు

Mon,April 15, 2019 01:45 PM

UP Man fakes IAS selection after father suffers stroke

లక్నో : సివిల్ సర్వీసెస్ వచ్చిందని ఓ యువకుడికి సన్మానాలు.. సత్కారాలు చేశారు. అతడి ఇంటికొచ్చి అభినందనలు తెలిపారు. మీడియా వచ్చి ఇంటర్వ్యూలు కూడా చేసింది. ఆ ఇంటర్వ్యూల తర్వాతే అసలు విషయం బయటపడింది. తీరా ఆ యువకుడికి సివిల్ సర్వీసెస్ రాలేదని తేలింది. దీంతో ఆ యువకుడి తండ్రికి గుండెపోటు వచ్చింది.

ఉత్తరప్రదేశ్ హపూర్ జిల్లాకు చెందిన సిద్ధార్థ్ గౌతమ్ స్థానికంగా కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే తన పేరు ఉన్న మరో వ్యక్తికి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 532వ ర్యాంకు వచ్చింది. ఇక ఏ మాత్రం ఆలోచించని సిద్ధార్థ్ గౌతమ్.. ఓ నకిలీ అలాట్‌మెంట్ లెటర్‌ను తయారు చేసి.. తనకు సివిల్ సర్వీసెస్ వచ్చిందని అందరిని నమ్మించాడు. దీంతో అతని ఇంటికొచ్చి అందరూ సిద్ధార్థ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పత్రికలు సిద్ధార్థ్‌ను ఇంటర్వ్యూ చేసి ఆ కథనాలను ప్రచురించాయి.

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 532వ ర్యాంకు సాధించిన సిద్ధార్థ్ గౌతమ్.. ఆ ఇంటర్వ్యూలను చదివి షాకయ్యాడు. ఆ తర్వాత నకిలీ సిద్ధార్థ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిద్ధార్థ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. దీంతో సిద్ధార్థ్ తండ్రికి గుండెపోటు వచ్చింది. సివిల్స్ ఫలితాల్లో 532వ ర్యాంకు సాధించిన సిద్ధార్థ్.. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్(ఐఆర్‌ఏఎస్)లో ఉద్యోగం చేస్తున్నాడు.

4077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles