ప్రాధేయపడ్డ వదల్లేదు.. కన్న కూతురిపై కత్తిపోట్లు

Sun,June 16, 2019 10:19 AM

UP Girl Stabbed By Father To Stop Her From Studying

లక్నో: కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి కత్తితో పలుమార్లు దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షహజన్‌పూర్‌లో చోటుచేసుకుంది. తండ్రి కోరిక ప్రకారం పెండ్లి చేసుకోకుండా నిరాకరించడం, చదువుకుంటానని చెప్పడమే ఇందుకు కారణంగా బాధిత బాలిక(15) పేర్కొంది. బాలిక కథనం ప్రకారం.. ఓ కాలువ వెంబడి ఎవరూలేని ప్రదేశానికి నా తండ్రి, సోదరుడు కలిసి నన్ను తీసుకువెళ్లారు. సోదరుడు నా మెడపై వస్త్రంతో గట్టిగా వెనక్కి లాగుతుండగా నా తండ్రి కత్తితో వెనుకనుంచి పలుమార్లు పొడిచాడు. ఎంతగా ప్రాధేపడినప్పటికి కరుణించలేదు. ఆపై కాలువలోకి తోసేశాడు. కాసేపటి తర్వాత చంచానో, బ్రతికానో అని చూసేందుకు తిరిగి వచ్చాడు. వారికి కనిపించకుండా ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నానని తెలిపింది. బాలిక అక్క భర్త మాట్లాడుతూ.. ఆమె మా కుటుంబంతో పాటే ఉండేది. వారి కుటుంబ సభ్యులకు ఆమె చదువుకోవడం ఇష్టం లేదు. పెండ్లి చేయాలని చూశారు. కొన్ని రోజులక్రితమే మా ఇంటి నుంచి తీసుకుపోయారు. కాలువ ప్రక్కన పడిఉన్నట్లు ఫోన్ రావడంలో వెళ్లి చూశానని తెలిపాడు. బాధితురాలి వాగ్మూలం తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

6845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles