నేరారోపణతో బాలుడికి పోలీసుల చిత్రహింసలుSat,November 18, 2017 06:15 PM

నేరారోపణతో బాలుడికి పోలీసుల చిత్రహింసలు

లక్నో: నేరారోపణపై బాలుడిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచిన పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడు దొంగతనానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు విచారణ నిమిత్తం బాలుడిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విచారణ పేరుతో ఇద్దరు పోలీసులు తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ బాలుడిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. బాలుడి కాళ్లలో కర్ర పెట్టి ఇరువైపులా ఇద్దరూ నిలబడ్డారు. బాధను ఓర్చుకోలేని బాలుడు క్షమించమని ఎంతగా ప్రదేయపడినా నిర్ధయగా ప్రవర్తించారు. కాసేపటి తర్వాత అదే ఇద్దరూ పోలీసులు మళ్లీ వచ్చి బండ బూతులు తిడుతూ బాలుడిని చెంపలపై కొడుతూ, కాళ్లతో తన్నుతూ ఆనక పోలీస్ లాఠీతో తీవ్రంగా చితకబాదారు.

ఈ ఘటన ఎప్పుడు చోటుచేసుకుంది కచ్చితంగా తెలియనప్పటికి గడిచిన నెలలో పనియరా పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాజ్‌గంజ్ పోలీస్ ఉన్నతాధికారి రాకేష్ ప్రతాప్‌సింగ్ స్పందిస్తూ.. జరిగిన ఘటనపై విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వీడియోలో అగుపిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ కేఎన్ శశిని ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కాగా బాలుడిని అరెస్టు చేసింది లేనిది ఇంకా తెలియరాలేదు.

1330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS