యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ రూ.25 లక్షలు డిమాండ్ చేశాడు

Fri,June 8, 2018 12:23 PM

up cm Principal Secy SP Goyal demanded Rs 25 lakh bribe Says Abhishek

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రిన్సిపల్ సెక్రటరీపై అభిషేక్ గుప్తా అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. లక్నోకు చెందిన అభిషేక్ గుప్తా పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలనుకున్నాడు.

పెట్రోల్ బంకు ఏర్పాటు అనుమతికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌పీ గోయల్ తనను రూ.25 లక్షలు లంచం డిమాండ్ చేశాడని అభిషేక్ గుప్తా ఆరోపిస్తున్నాడు. ఎస్‌పీ గోయల్ తొలుత పరోక్షంగా లంచం ఇవ్వాలని కోరాడని, ఆ తర్వాత పెట్రోల్ బంకు ఏర్పాటుకు సంబంధించి ప్రత్యక్షంగా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని అభిషేక్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అభిషేక్ గుప్తా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

1657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles