యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు కాల్చివేత

Wed,June 12, 2019 05:34 PM

UP Bar Council Chief Shot Dead In Agra Court

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలు దర్వేశ్‌ యాదవ్‌ హత్యకు గురయ్యారు. సహచర న్యాయవాది కాల్పుల్లో ఆమె హత్యకు గురయ్యారు. యూపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షురాలిగా ఆమె రెండు రోజుల క్రితమే ఎన్నికయ్యారు. ఆగ్రా జిల్లా కోర్టులో ఆమె నేడు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాగత స్వీకారం తీసుకునేందుకు వెళ్తుండగా హత్యకు గురయ్యారు. దర్వేశ్‌పై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు మనీశ్‌ తనకు తానుగా కాల్చుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

1703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles