ఇది రెండ‌వ స్వాతంత్ర స‌మ‌రం..

Sat,January 19, 2019 01:33 PM

కోల్‌క‌తా: యునైటెడ్ ఇండియా ర్యాలీలో డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడారు. త‌మిళంలో మాట్లాడిన ఆయ‌న‌ దేశంలో రెండ‌వ స్వాతంత్య్ర స‌మ‌రం మొద‌లైంద‌న్నారు. మ‌నమంతా క‌లిసి క‌ట్టుగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌నం ఒకటైతే, బీజేపీ ఓట‌మి త‌థ్య‌మ‌న్నారు. అందుకే ప్ర‌ధాని మోదీ మ‌న‌పై ప్ర‌తి వేదిక‌లోనూ విమ‌ర్శిస్తున్నార‌ని అన్నారు. దేశం ప‌ట్ల మోదీ వ్య‌తిరేకంగా ఉంటే, ఆయ‌న‌పై నేను వ్య‌తిరేకంగా ఉంటాన‌ని స్టాలిన్ అన్నారు. మోదీ చేప‌ట్టిన‌ విధ్వంస‌క‌ర విధానాల‌ను డీఎంకే నేత త‌ప్పుప‌ట్టారు. ప్ర‌ధానిపై త‌న‌కు వ్య‌క్తిగ‌త వ్య‌తిరేక‌త ఏమీలేద‌న్నారు. బెంగాల్‌కు, త‌మిళంకు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. త‌మిళ‌నాడులో స్వామి వివేకానంద స్మార‌కం ఉంద‌ని గుర్తు చేశారు. రాజ‌కీయాల‌తో పాటు ఇత‌ర అంశాల్లోనూ బెంగాలీల త‌ర‌హాలోనే త‌మిళులు ఉంటార‌న్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ పిలుపు మేర‌కు తాను రెండవ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. అధికారంలోకి రాక‌ముందు న‌ల్ల‌ధ‌నంపై పోరాటం చేస్తామ‌న్నారు. కానీ అదేమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్ర‌తి అకౌంట్‌లోకి 15 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు, ఇంత క‌న్నా పెద్ద మోసం ఏమి ఉంటుంద‌ని స్టాలిన్ ప్ర‌శ్నించారు.

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles