కేరళకు ఎమిరేట్స్ 700 కోట్ల సాయం

Tue,August 21, 2018 12:28 PM

United Arab Emirates offered financial assistance of Rs 700 crores for  Kerala Floods

తిరువనంతపురం : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ర్టానికి అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ రాష్ర్టానికి అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ర్టాలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టామని తెలిపారు. కేరళకు రూ. 700 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అబుదాబి ప్రిన్స్.. ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు విజయన్ పేర్కొన్నారు. వర్షాలు తగ్గడంతో.. ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పలు ఇండ్లలో బురద ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.4776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles