బ్లూవేల్ గేమ్‌.. హెల్ప్‌లైన్‌ నెంబ‌ర్ 1098

Thu,September 7, 2017 12:52 PM

Union minister Maneka Gandhi sends letter to school principals over blue whale challenge


న్యూఢిల్లీ : బ్లూవేల్ ఛాలెంజ్ వీడియో గేమ్‌కు విద్యార్థులు బ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ‌ మంత్రి మేన‌కాగాంధీ దేశంలోని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాశారు. బ్లూవేల్ గేమ్ ప‌ట్ల టీచ‌ర్లు, విద్యార్థులు అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని లేఖ‌లో సూచించారు. బ్లూవేల్ గేమ్ ఆడుతూ ఇప్ప‌టికే అనేక మంది పిల్ల‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. బ్లూవేల్‌కు బాధితులుగా మారుతున్న విద్యార్థుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నదే అని మంత్రి అన్నారు. గేమ్‌ను డౌన్‌లోడ్ చేయ‌కుండా ఉండేందుకు వీలైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌ను కోరిన‌ట్లు మేన‌కాగాంధీ తెలిపారు. విద్యార్థుల ప్ర‌వ‌ర్త‌న‌పై టీచ‌ర్లు నిఘా పెట్టాల‌ని, ఏదైనా అనుమానం క‌లిగితే, హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 1098కు ఫోన్ చేయాల‌ని ఆమె కోరారు.


2060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles