తెలుగు భాషలో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి

Mon,June 17, 2019 12:15 PM

Union Minister Kishan reddy take oath in Telugu Language

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభ సభ్యుడిగా తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. 17వ లోక్‌సభ తొలి సమావేశంలో మొదట ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయగా, అనంతరం కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. లోక్‌సభలో మొత్తం 22 భాషల్లో ప్రమాణస్వీకారం చేయొచ్చు. అందుకు లోక్‌సభ అనుమతి ఉంది. అయితే బాబుల్ సుప్రియో ప్రమాణ చేసేందుకు వెళ్తున్న క్రమంలో జైశ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గోవా ఎంపీ శ్రీపాద యశో నాయక్ సంస్కృత భాషలో ప్రమాణస్వీకారం చేశారు. డాక్టర్ జితేంద్ర సింగ్ డోగ్రీ భాషలో ప్రమాణం చేశారు. డాక్టర్ హర్షవర్ధన్ సంస్కృత భాషలో ప్రమాణం చేస్తున్న సమయంలో ఆ భాషను విని ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మైల్ ఇచ్చారు. ప్రహ్లాద్ జోషి కన్నడ భాషలో, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మరాఠీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.

5164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles