25 నగరాలు, పట్టణాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం

Sun,November 11, 2018 05:28 PM

Union Home ministry has given consent to renaming of 25 cities in last one year

న్యూఢిల్లీ: గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాలు, పట్టణాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా యూపీలోని అలహాబాద్, ఫైజాబాద్ ఈ జాబితాలో చేరాయి. ఇక వెస్ట్ బెంగాల్‌ను బంగ్లాగా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్ల మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఏడాది సమయంలో 25 నగరాలు, పట్టణాలు, పల్లెల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపినట్లు హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ పేరును అయోధ్యగా మార్చే ప్రతిపాదనలను యూపీ ప్రభుత్వం ఇంకా పంపలేదని ఆ అధికారి చెప్పారు. ఇప్పటివరకు ఆమోదించిన వాటిలో ముఖ్యమైన ప్రదేశాలను చూస్తే.. ఏపీలోని రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హర్యానాలోని పిండారీని పండు-పిండరగా మార్చారు. మరికొన్ని ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లను సంప్రదించిన తర్వాతే ఈ పేర్ల మార్పునకు హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతుంది. ఈ మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను కూడా కర్ణావతిగా మార్చాలని అనుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు.

8004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles