మమతా.. పంతానికి పోవొద్దు..

Fri,June 14, 2019 12:41 PM

Union Health Minister Dr Harsh Vardhan responds on Doctors strike

న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పరోక్షంగా చురకలంటించారు. వైద్యుల విషయంలో మమత పంతానికి పోవొద్దు అని ఆయన ఆమెకు సూచించారు. బెంగాల్‌ వైద్యులకు మద్దతుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. డాక్టర్ల నిరసనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పందిస్తూ.. డాక్టర్ల ఆందోళన విషయంలో మమత పంతానికి పోవొద్దని ఆమెకు అప్పీల్‌ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆందోళనలు విరమించి.. తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు అల్టిమేటం జారీ చేసినందునే వారు నిరసనలు కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇవాళ తాను మమతతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని, ఓ లేఖ కూడా రాస్తానని తెలిపారు. ఇక డాక్టర్ల రక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నానని, తక్షణమే ఆందోళనలు విరమించి.. విధుల్లో చేరాలని కేంద్రమంత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు.
2300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles