‘మాల్యాను వెనక్కి రప్పించడంలో కేంద్రం విఫలం’

Mon,June 20, 2016 05:53 PM

union government is failed to extradition of vijay malya, lalit modi

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్, దేశంలోని వివిధ బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నిందితుడు విజయ్ మాల్యాను వెనక్కి రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌నేత జైరాం రమేష్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. లండన్‌లో మాల్యా విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నా కేంద్రంకు పట్టింపులేదని మండిపడ్డారు. ఆయనను దేశానికి రప్పించడంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. నిన్నటి కేంద్ర విదేశాంగ శాఖ స్టేట్‌మెంట్ చూస్తుంటే లలిత్ మోదీని కూడా దేశానికి రప్పించేలా లేరని అన్నారు. అసలు మాల్యాను, లలిత్ మోదీని దేశానికి వాపసు తీసుకొచ్చే ఉద్దేశ్యం ఉందా? అని ప్రశ్నించారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles