కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

Fri,May 31, 2019 01:21 PM

Union Cabinet Portfolios Announced

హైదరాబాద్ : భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరికి ఇవాళ శాఖలు కేటాయించారు.

కేంద్ర మంత్రులు
నరేంద్ర మోదీ - ప్రధానమంత్రి, అణు శక్తి, అంతరిక్షంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు
రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ
అమిత్ షా - హోం శాఖ
నితిన్ గడ్కరీ - రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సదానంద గౌడ - ఎరువులు, రసాయనాలు
నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ
రామ్ విలాస్ పాశ్వాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
రవిశంకర్ ప్రసాద్ - న్యాయశాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్
థావర్‌చంద్ గహ్లోత్ - సామాజిక న్యాయశాఖ
సుబ్రమణ్యం జైశంకర్ - విదేశీ వ్యవహారాలు
రమేశ్ ఫోఖ్రియాల్ - మాననవనరుల శాఖ
అర్జున్ ముండా - గిరిజన వ్యవహారాలు
స్మృతి ఇరానీ - మహిళా శిశు సంక్షేమం, జౌళి

హర్షవర్ధన్ - ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రకాశ్ జవదేకర్ - అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐ అండ్ బీ
పీయూష్ గోయల్ - పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు
ధర్మేంద్ర ప్రదాన్ - పెట్రోలియం, ఉక్కు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
మహేంద్రనాథ్ పాండే - నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రైన్యూర్ షిప్
అరవింద్ సావంత్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
గిరిరాజ్ సింగ్ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్
గజేంద్ర సింగ్ షెకావత్ - జలవనరులు(జల్ శక్తి)

సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)
సంతోష్ కుమార్ గాంగ్వర్ - శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
ఇంద్రజిత్ సింగ్ - ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశో నాయక్ - ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి
జితేంద్ర సింగ్ - సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి
కిరణ్ రిజిజు - క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ సింగ్ పటేల్ - సాంస్కృతిక పర్యాటక శాఖ
రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరి - గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్ సుఖ్ మాండవ్య - షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు

సహాయ మంత్రులు
ఫగన్ సింగ్ కులస్తే - ఉక్కు శాఖ సహాయ మంత్రి
అశ్వినీ కుమార్ చౌబే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
అర్జున్ రామ్ మేఘవాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి
జనరల్ వీకే సింగ్ - రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి
కిషన్ పాల్ - సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
రావు సాహెబ్ దాన్వే - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయ మంత్రి
కిషన్ రెడ్డి - హోంశాక సహాయ మంత్రి
పురుషోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
రాందాస్ అథవాలే - సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
సాధ్వి నిరంజన్ జ్యోతి - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
బాబులు సుప్రియో - అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి
సంజీవ్ కుమార్ బల్యాన్ - పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్ సహాయ మంత్రి
ధోత్రే సంజయ్ శ్యామ్ రావు - మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
అనురాగ్ సింగ్ ఠాకూర్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
సురేశ్ చిన బసప్ప - రైల్వే శాఖ సహాయ మంత్రి
నిత్యానంద్ రాయ్ - హోంశాఖ సహాయ మంత్రి
రతన్ లాల్ కఠారియా - జలవనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
వి. మురళీధరన్ - విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
రేణుకా సింగ్ సరూత - గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
సోమ్ ప్రకాశ్ - పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి
రామేశ్వర్ తేలి - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ర్టీ శాఖ సహాయ మంత్రి
ప్రతాప్ చంద్ర సారంగి - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫిషరీస్ శాఖ సహాయ మంత్రి
కైలాస్ చౌదరి - వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
దేబోశ్రీ చౌదరి - మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి

2989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles