మొత్తం బడ్జెట్ 24 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంత

Thu,February 1, 2018 01:22 PM

Union Budget 2018 allocations details

న్యూఢిల్లీ : రూ. 24 లక్షల 42 వేల 213 కోట్ల అంచనాతో 2018-19 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఇవాళ ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ. 7 లక్షల 78 వేల 712 కోట్లు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు రూ. 7 లక్షల 8 వేల 934 కోట్లు కేటాయించారు. ఇతర వ్యయాలు, వడ్డీ చెల్లింపులకు రూ. 5 లక్షల 75 వేల 975 కోట్లు కేటాయించారు. గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు కేటాయించారు. 2022 నాటికి ప్రతి పౌరుడికి సొంతింటి ఇల్లు కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

-రైల్వేలకు రూ. 1.48 లక్షల కోట్లు
-ఎస్సీల సంక్షేమం కోసం రూ. 56,619 కోట్లు
-ఎస్టీల సంక్షేమం కోసం రూ. 39,135 కోట్లు
-చిన్న, సూక్ష్మ తరహా పరిపరిశ్రమల కోసం రూ. 3,790 కోట్లు
-టీబీ రోగుల సంక్షేమం కోసం రూ. 600 కోట్లు
-గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు
-విద్య, ఆరోగ్య, సంక్షేమానికి రూ. 1.38 లక్షల కోట్లు
-రోడ్లు, మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు
-ఇంటింటికీ తాగునీటి పథకానికి రూ. 77,500 కోట్లు
-ఆకర్షణీయ నగరాల కింద రూ. 2.04 లక్షల కోట్లతో 99 నగరాల ఆధునీకరణ
-చేనేత, జౌళి రంగానికి రూ. 7,500 కోట్లు
-టెక్స్ట్ టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు
-2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు
-ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు కేటాయించాం
-రూ. 2 వేల కోట్ల కార్పస్ ఫండ్ తో వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి చర్యలు
-ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు
-గంగా ప్రక్షాళనకు రూ. 16 వేల 700 కోట్లు
-2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్ల మేర ముద్రా రుణాలు
-ప్రతి పౌరునికి సమీపంలో వెల్ నెస్ సెంటర్
-వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 1200 కోట్లు
-జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు
-వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1290 కోట్లు
-నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు

3527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles