నోట్లు పంచి అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే ఇది ఆచారమంటున్నాడు

Fri,November 16, 2018 03:24 PM

U'khand bjp mla distribute money to women

ఉత్తరాఖండ్‌లో ఓ బీజేపీ నేత ఎన్నికల హడావుడి మధ్య ఓటర్లకు నోట్లు పంచాడు. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి ఛత్ పూజ సందర్భంగా మహిళలకు వందనోట్లు పంచిపెట్టారు. ఆ దృశ్యాలు వీడియోకు చిక్కి నెట్‌లో ప్రస్తుతం వైరల్ అయ్యాయి. వచ్చే ఆదివారమే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయన చర్యపై విమర్శలు తలెత్తుతున్నాయి. పైగా అది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. కానీ జోషి మాత్రం తను చేసింది సబబేనని సమర్థించుకుంటున్నారు. ఇదంతా ఆచారం అంటున్నారు. నాకు తిలకం దిద్దిన మహిళలకు మాత్రమే డబ్బు ఇచ్చాను. ఇది తాతలనాటి ఆచారం.. ఇందులో తప్పేముంది? అని దబాయిస్తున్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అంతా భూతద్దంలో చూపిస్తున్నదని మండిపడ్డారు. ఎధ్నకల సంఘం నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసు రాలేదని చెప్పారు. అయినా మందు పంచితే ఏమీ అనరు నేను డబ్బులు పంచితేనే తప్పొచ్చిందా? అని ఎదురుదాడికి దిగారు. ఈ మసూరీ శాసనసభ్యునికి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఓ పోలీసు అశ్వంపై ఈయన దాడి చేసినప్పుడు అది గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. అప్పట్లో ఆ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ డబ్బు పంపిణీని తేలికగా తీసుకుంటుందా? ఏది చూడాలి.

2305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles